భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

0

 భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

 - సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత 

BSBNEWS - కందుకూరు 

వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లి రెవిన్యూ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 4 లోని ప్రభుత్వ భూములను ఆక్రమించిన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకొని, ఆక్రమణలను తొలగించాలని సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త  షేక్ హుస్సేన్ సోమవారం సమర్పించిన వినతిలో పేర్కొన్నారు. అయ్యవారిపల్లె రెవిన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 4 లో ప్రభుత్వ భూమి ఉంది అని, మాలకొండ దేవస్థానంకు కూత వేటు దూరంలో ఉన్న ఈ భూములు అత్యంత విలువైనవి అని, ఇదే సర్వే నెంబర్ లోని మరికొంత ప్రభుత్వ భూమిని డబ్బు, రాజకీయ, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఆక్రమించి ఏకంగా అనధికారికంగా ప్లాట్లు వేసి, అగ్రిమెంట్లు ద్వారా విక్రయాలు కూడా జరిపినట్లు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. 


ఇటుకల యూనిట్ ఏర్పాటు.


సర్వేనెంబర్ 4 లోని సుమారు ఐదు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇటుకల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నారని సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. దానికి స్పందించిన సబ్ కలెక్టర్ వెంటనే తహశీల్దార్ తో చరవాణి ద్వారా మాట్లాడి ఫారెస్ట్ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములలో ఉన్న ఆక్రమణలను తక్షణం తొలగించాలని ఆదేశించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)