హాయ్ బాగున్నారా... ఆప్యాయంగా పలకరించుకున్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని అయ్యవారిపాలెం పంచాయితీలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడకు హాజరైన కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, వైయస్సార్సీపి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ఒకరికి ఒకరు హాయ్ బాగున్నారా.. అంటూ ఆప్యాయంగా పలకరించుకున్న దృశ్యం అందరినీ ఆకర్షించింది. నువ్వెంత అంటే నేనెంత అనుకునే రాజకీయ ప్రత్యర్థులు ఒక్కసారిగా కరచాలనం చేసుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు. అయితే కందుకూరు అభివృద్ధికి ఈ దృశ్యం నాంది పలుకుతుందని పలువురు చర్చించుకున్నారు. మరి కొంతమంది కందుకూరులో రాజకీయాలు మారనున్నాయా అన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జయంతి ఉత్సవాలకి వచ్చిన భక్తులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఒక మంచి దృశ్యాన్ని అందించారని అక్కడ ఉన్న భక్తులు తెలుపుతున్నారు.