కొండముడుసు పాలెం, కంచరగుంటలో పొలంపిలుస్తుంది
BSBNEWS - కందుకూరు
మండలంలోని కొండముడుసు పాలెం, కంచరగుంట గ్రామంలో మండల వ్యవసాయాధికారి వి. రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వి.రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రతి రైతుకి ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య(యూనిక్ నెంబర్)ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని సులభతరం చేసి పారదర్శకంగా సేవలను అందించడం కోసం చేయబడుతున్న బృహ హత్కరమైన రైతు ప్రత్యేక విశిష్ట సంఖ్య (యూనిక్ నెంబర్)నమోదు కార్యక్రమం అని తెలియజేసారు. రైతులు మీ సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు ఆధార కార్డు, పట్టాదారు పాసు పుస్తకాలు, మొబైల్ నెంబర్ తీసుకొని ప్రత్యేక పోర్టల్ లో అన్ని వివరాలు నమోదు చేసుకొన్న తర్వాత ఒక ప్రత్యేక విశిష్ట సంఖ్య పొందవచ్చునని, తద్వారా రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే వివిధ రకాల పథకాలు, రాయితీలు, పి ఎం కిసాన్, అన్నదాత సుఖీభవ, యంత్ర పరికరాలు, పంటల బీమా, పెట్టుబడి రాయితీలు, తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. రైతులు అందరూ తప్పనిసరిగా రబీ సీజన్లో వేసిన ప్రతి పంటను పంట నమోదు చేసుకోవాలని, కెవైసి చేసుకోవాలని కోరారు. కొండముడుసు పాలెం రైతు సేవా కేంద్రంలో మోపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సెక్రెటరీ టి. హరి క్రిష్ణ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ఏర్పాటు చేశారు. ప్రతి రైతు మీ ధాన్యాన్ని ఆరబెట్టుకొని చెత్త లేకుండా శుభ్రం చేసుకొని 17 శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు కేంద్రానికి తీసుకొని రావాలని తదుపరి ప్రభుత్వం ద్వారా ఒక క్వింటా రూ 2300.00 రైతుకి చెల్లిస్తుందని తెలియజేసారు. మండలంలోని వరి ధాన్యం పండించిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పరిషత్ అధ్యక్షురాలు ఇంటూరి సుశీల, కొండముడుసు పాలెం గ్రామ సర్పంచ్ తుమ్మా .కోటేశ్వరమ్మ, ఉప సర్పంచ్ పొడపాటి మహేశ్ రెండు గ్రామాల గ్రామ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు ఎల్ రమాదేవి, కె.శరత్ కుమార్, ప్రకృతి వ్యవసాయ మోడల్ మేకర్ పి మాధవ, వ్యవసాయ మార్కెట్ యార్డు అసిస్టంట్ కె. అశోక్, రెండు గ్రామాల గ్రామ పెద్దలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.