బడి పిల్లలా...?పని పిల్లలా...? - కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల అవస్థలు

0

 బడి పిల్లలా...?పని పిల్లలా...?

కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థుల అవస్థలు

BSBNEWS -KANDUKUR  ఆగస్టు


కందుకూరు పట్టణంలోని దివి లింగపునాయుడు పార్క్ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయంను టిఆర్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద నిర్మించిన నూతన భవనంలోకి మార్చుతున్న తరుణంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల చేత బల్లలు పట్టించి పనిచేస్తున్న తీరు చూస్తుంటే వారు బడి పిల్లలా..? లేక పని పిల్లలా...? అన్న ప్రశ్న చూపరులకు కలిగింది. కేంద్రీయ విద్యాలయంలో సీటు రావాలంటే చాలా కష్టం. అటువంటి ఒక పేరు ఉన్న కేంద్రీయ విద్యాలయంలలో ఒకటైన కందుకూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయం విద్యార్థులను పని పిల్లలగా మార్చి పనిచేయటం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శనివారం కనిపించిన దృశ్యం చూస్తే కేంద్రీయ విద్యాలయంలో పిల్లలను ఇదేవిధంగా వెట్టి చాకిరి చేపిస్తారేమో అని అనుమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పర్యవేక్షించాల్సిన అధికారుల సైతం మౌనంగా ఉండటం దేనికి సంకేతము అర్థం కాని ప్రశ్నగా మారింది.

Post a Comment

0Comments
Post a Comment (0)