శ్రీసీతారామ స్వామి కళ్యాణంలో
ఎమ్మెల్యే ఇంటూరి
- ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
BSBNEWS - ఉలవపాడు
మండలంలోని పెదపట్టపుపాలెం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెం గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగిన శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ సీతారామ స్వాములు కళ్యాణం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యేకి వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ,శ్రీ సీతారాముల ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నానని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు పార్టీ నాయకులు మేళ తాళాలతో ఘనస్వాగతం పలికారు. ఈ మహోత్సవంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.