కందుకూరు ఆర్టీసీలోని కనిగిరి బస్సులో నగలు అపహరణ
BSBNEWS - KANDUKUR
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో కనిగిరి డిపోకు చెందిన కందుకూరు నుండి కనిగిరి వెళ్లే బస్సులో బంగారం అపహరణ జరిగింది. బాధితురాలు తెలిపిన ప్రకారం మూడు సవర్లు నల్లపూసల దండ, రెండు గ్రాములు కమ్మలు, ఒక ముత్యాల పట్టి మొత్తంగా మూడున్నర సవరలు బంగారం పోయినట్టు తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆర్టిసి డిపోలోకి తీసుకుని వెళ్లి ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. బాధితురాలు మానస కందుకూరు నుండి భోగంపాడు వెళ్లేందుకు కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో కనిగిరి బస్సు ఎక్కడ జరిగింది. బస్సు రద్దీగా ఉండడంతో తనతో ఉన్న బ్యాగులు దగ్గర పెట్టుకునే సమయంలో బ్యాగు జిప్పులు తీసి ఉండటం గమనించి చూసుకోగా బంగారం పోయినట్టు గమనించింది. దాంతో పోలీసులకు సమాచారాన్నించటంతో పోలీసులు బస్సును ఆర్టీసీ డిపో గ్యారేజ్ లోనికి తీసుకువెళ్లి ప్రయాణికులను తనిఖీ చేశారు..