ఏ సమస్య వచ్చినా మీకు తోడుంటా..ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS - KANDUKURకందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల పాస్టర్లు, గోనుగుంట వెంకటేశ్వర్లు (తిమోతి) ఆధ్వర్యంలో, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా విజయం సాధించటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించి, ఆశీర్వదించారు. పాస్టర్లకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను నేరుగా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. జడ ఆంతోనిబాబు, శ్యామ్, జోసఫ్ కుమార్, కాలేబు, యాకోబు, దేవకుమార్, లాబాను, యేసుదాసు, సామ్యేలు, నాగేశ్వరరావు, పలువురు పాస్టర్లు ఎమ్మెల్యేని కలిశారు.

