కబ్జాదారులు ఎంతటివారైనా చర్యలు తప్పవు - ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి

0

కబ్జాదారులు ఎంతటివారైనా చర్యలు తప్పవు - ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి

BSBNEWS - KAVALI


కావలి పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను,పంట కాలువల భూములను, పంట గుంటలను, పంట వాగులను ఆక్రమించి లేఅవుట్ లు వేసి ప్లాట్ల రూపంలో అమ్ముకుని సొమ్ము చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం రైతులు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శీన నాయక్ కు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ముందుగా ఆర్డీవో కార్యాలయం బయట వర్ధిల్లాలి రైతుల ఐక్యత అని పంట కాలువలను గుంటలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ త్వరలో రెవిన్యూ అధికారులను అందరిని మార్చే ప్రయత్నంలో ఉన్నామని, పంట కాలువలను, గుంటలను, వాగులను, ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వారిపై చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)