ఉలవపాడు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కే.అంకమ్మ

0

ఉలవపాడు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అంకమ్మ

BSBNEWS - ఉలవపాడు AUGUST 23

ఉలవపాడు నూతన ఎస్సైగా కే అంకమ్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ బాజిరెడ్డి విఆర్ కు వెళ్లారు. నెల్లూరు ఎస్పీ ఆఫీసు నందు విధులు నిర్వహిస్తున్న  కే అంకమ్మ బదిలీపై ఉలవపాడు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ అంకమ్మ మాట్లాడుతూ ఉలవపాడు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు, ఫ్రెండ్లీ పోలీసింగ్ కు  ప్రాధాన్యత నిస్తానని తెలిపారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక రవాణా, కోడి పందెం, పేకాట, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వినియోగంపై చట్టపరమైన కట్టిన  చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉలవపాడు స్టేషన్లోని సిబ్బంది ఎస్సై అంకమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎస్ఐ అంకమ్మ కరోనా సమయంలో కందుకూరు రూరల్ ఎస్సైగా విధులు నిర్వహించారు. కరోనా సమయములో కందుకూరు ప్రజలకు మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు  పొందారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)