భారీ విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

0

 భారీ విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి                

BSBNEWS - కందుకూరు ఆగస్టు 22 


పట్టణంలోని బృందావనం ఐదో వార్డులో ఏర్పాటు చేయబోతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం కోసం 5 లక్షల భారీ విరాళాన్ని పార్లమెంట్ సభ్యులు వేమీరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందజేశారు. స్థానిక బృందావనం వాసులు పాలేటి కోటేశ్వర రావు, చనమాల వెంకటేశ్వర్లు,  జమ్మలమడుగు రవి, పాలూరు...దొండపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పులిచర్ల వెంకట సుబ్బారెడ్డి తో కలిసి నెల్లూరు లోని వేమిరెడ్డి కార్యాలయంలో  ఎంపిని కలిశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు పులిచర్ల వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ                                    అడిగింది తడవుగా చేతికి ఎముక లేనట్లు 5 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించి, ఆయనకు  అపర దాన కర్ణుడు అని ప్రజల్లో వున్న నానుడి సార్థకం అయింది అని అన్నారు. విషయం చెప్పగానే స్పందించిన వేమిరెడ్డీ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమం తలపెట్టారని ఇంకా ఏమైనా అవసరమైతే నాదృష్టికి తీసుకువస్తే మరికొంత ఆర్థిక సహాయం చేస్తానని అన్నారు. దీంతో ఎంపీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)