కే.బి.ఎస్.ఎస్.లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి-- అభినందనలు తెలిపిన కే.బి.ఎస్.ఎస్.నేతలు.

0

 కే.బి.ఎస్.ఎస్.లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా మహేశ్వరి..-- 

అభినందనలు తెలిపిన కే.బి.ఎస్.ఎస్.నేతలు...

BSBNEWS - ONGOLE 27.08.2024

కాపు, బలిజ సంక్షేమ సేన లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గా ఒంగోలు నగరం లోని మిరియాలపాలెం కు చెందిన ఆరిక.మల్లిఖార్జున రావు కుమార్తె ఆరిక. మహేశ్వరిని నియమిస్తూ కాపు,బలిజ సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు,మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు చేగొండి.హరి రామ జోగయ్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చిన్నతనం నుంచి ఎంతో చురుకైన మహేశ్వరి తన న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకున్న అనంతరం స్థానికంగా కొంత కాలం న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతిలో ప్రారంభమైన తర్వాత గత 8 సంవత్సరాల కాలం నుంచి ఆమె హైకోర్టులో ప్రాక్టీసు చేస్తున్నారు. కొంత కాలం నుంచి కాపు, బలిజ సంక్షేమ సేనకు బాసటగా ఉంటూ, సామాజిక వర్గానికి చెందిన మహిళలను, యువతను చైతన్య పరుస్తూ, న్యాయ సలహాలు, సూచనలు అందిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా జనసేన పార్టీ అభివృద్ధికి కూడా తన వంతుగా కృషి చేస్తున్నారు. కాపు, బలిజ సంక్షేమ సేన అభివృద్ది కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన హరిరామ జోగయ్య వెంటనే కే.బి.ఎస్.ఎస్. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నందు ప్రత్యేక తీర్మానం చేయించి, ఆమెను రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేశారు. అంతే కాకుండా ఆమె నియామకానికి సంబంధించిన సమాచారాన్ని కే.బి.ఎస్.ఎస్. లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పోలిశెట్టి. రాధాక్రిష్ణకు తెలియజేసారు. ఈ సందర్భంగా అరిక.మహేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కాపు, బలిజ సంక్షేమ సేన పెద్దలు తనపై ఎంతో నమ్మకంతో నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగిందని, తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కాపు, బలిజ సంక్షేమ సేన లీగల్ సెల్ తరుపున కాపు,బలిజ వర్గీయుల సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. కే.బి.ఎస్.ఎస్.రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు గా ఎంపికైన ఆరిక.మహేశ్వరిని కే.బి.ఎస్.ఎస్. నెల్లూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బెల్లపు వెంకట సుధా మాధవ్, జిల్లా ఉపాధ్యక్షురాలు శైలజా నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుసర్ల. శ్రీహరి, కందుకూరు నియోజక వర్గ కాపు బలిజ సంక్షేమ సేన మహిళా అధ్యక్షురాలు చదలవాడ కామాక్షి నాయుడు, నెల్లూరు జిల్లా కాపు బలిజ సంక్షేమ సేన మహిళా విభాగం నేత బెల్లపు. గౌరి, హైకోర్టు న్యాయవాదులు షేక్.మీరావలి, రాచూరి. లక్ష్మీకర్, పి.శ్రీకాంత్, తదితరులు అభినందనలు తెలిపారు. తనను కే.బి.ఎస్.ఎస్. తరుపున రాష్ట్ర స్థాయిలో బాధ్యతాయుతమైన పదవిలో నియమించిన కే.బి.ఎస్.ఎస్. రాష్ట్ర అధ్యక్షుడు చేగొండి. హరిరామ జోగయ్య, కే.బి.ఎస్.ఎస్. రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు పోలిశెట్టి. రాధాకృష్ణ,అన్నమయ్య జిల్లా కే.బి.ఎస్.ఎస్.జిల్లా అధ్యక్షుడు శరత్ బాబు తదితరులకు మహేశ్వరి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)