పలు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన డిప్యూటీ డిఈవో
BSBNEWS - KANDUKUR
డివిజన్ పరిధిలోని కొండాపురం మండలం, లింగసముద్రం మండలాలలో ప్రభుత్వ పాఠశాలలను కందుకూరు డివిజన్ ఇంచార్జ్ డిప్యూటీ డిఇఓ రఘురామయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు భవిష్యత్తును పూర్తిస్థాయిలో ఇవ్వగలిగే వారు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం ఉపాధ్యాయులు మాత్రమేనని అటువంటి ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. విద్యార్థుల విషయంలో ఎటువంటి అలసత్యం వహించకుండా సరైన సమయంలో విద్యా బోధన చేసి వారికి మంచి విద్యను అందించాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు విద్యార్థుల చదువుల గురించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలు కు మంచి పేరు, ర్యాంకులు తీసుకువచ్చేలా పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు డిప్యూటీ డిఈవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.jpeg)

