పుస్తక పఠనం తోటే జ్ఞానం లభిస్తుంది
- సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు
BSBNEWS - KANDUKUR
ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివితేనే అన్ని విషయాలు తెలుసుకొని జ్ఞానం లభిస్తుందని కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విశాలాంధ్ర బుక్ హౌస్ ను కందుకూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి బూసి సురేష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని తెలుసుకునే దానికి విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా ప్రజలందరికీ తెలుసుకునేలా అన్ని రకాల పుస్తకాలను ఒక చోటకు చేర్చి పాఠకులకు అందిస్తుందన్నారు. నేటి యువతకు చరిత్రకారులు, యోధులు, పోరాట వీరులు దేశ నాయకులు తో పాటు ఎన్నోరకాల వాటి గురించి తెలియని, ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో యువత పక్కదారి పడుతుందని వారికి దేశ చరిత్ర గురించి, అనేక పోరాట యోధుల గురించి, మంచి జ్ఞానం అవలంభించే విధంగా అన్ని రకాల పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచటం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రతి సంవత్సరం కందుకూరుకు రావడం జరుగుతుందని, కందుకూరుతో పాటు రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలకు వెళుతూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విధంగా విశాలాంధ్ర బుక్ హౌస్ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి యర్రంశెట్టి ఆనందమోహన్, సిపిఐ నాయకులు ఉప్పుటూరు మాధవరావు, విశాలాంధ్ర బుక్ హౌస్ నిర్వాహకులు బాబు తదితరులు పాల్గొన్నారు.

