దగ్ధమైన షాపును పరిశీలించి, బాధితున్ని పరామర్శించిన ముస్లిం ఐక్యవేదిక నాయకులు.

0

 దగ్ధమైన షాపును పరిశీలించి, బాధితున్ని పరామర్శించిన ముస్లిం ఐక్యవేదిక నాయకులు.


BSBNEWS - KANDUKUR

 పట్టణంలోని ముస్లిం సోదరుడు షేక్ రఫీ టైర్ల షాపు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైన సంగతి తెలుసుకొని కందుకూరు నియోజకవర్గ ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో సోమవారం  పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా వారు బాధితున్ని పరామర్శించి మనోధైర్యంతో ఉండాలని, తిరిగి వ్యాపార రంగంలో పురోభివృద్ధి సాధించుటకు కృషి చేయాలని, అందులకు గాను ముస్లిం ఐక్యవేదిక తన పరిధిలో తగిన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షేక్ ఫజుల్లా, మునీర్ బాయ్, ఎస్.ఎం భాష తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)