రక్తదానం వలన మరో ప్రాణాన్ని కాపాడొచ్చు- ఎమ్మెల్యే ఇంటూరి

0

రక్తదానం వలన మరో ప్రాణాన్ని కాపాడొచ్చు 

- ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR




రక్త దానం చేయటం వల్ల  ఆపదలో ఉన్న మరో ప్రాణాన్ని రక్షించే అవకాశం మనకు లభిస్తుందని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. పట్టణంలోని శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపం నందు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం లాంటి గొప్ప కార్యక్రమాన్ని  పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఏర్పాటు చేయడం  అభినందనీయం అన్నారు. విధి నిర్వహణలో తమ కుటుంబాల సైతం దూరంగా ఉంటూ ప్రజల కోసం పోలీసులు పని చేస్తారని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల్ని గౌరవించడం మన కర్తవ్యంగా ప్రతి పౌరుడు భావించాలని ఆయన కోరారు. కందుకూరు డిఎస్పి సిహెచ్ వి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పది అన్నారు. రక్త దానం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సిఐకే వెంకటేశ్వరరావు, గుడ్లూరు సీఐ మంగారావు, కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)