హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు కు న్యాయం చేయండి - ఎమ్మెల్యే ఇంటూరి

0

హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు కు న్యాయం చేయండి 

- ఎమ్మెల్యే ఇంటూరి

BSBNEWS - KANDUKUR

హైవే నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు కు న్యాయం చేయండి అని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు కందుకూరు శాసనసభ్యులు ఇంటర్ నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాను కందుకూరు  శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలు సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న నూతన హైవే 167బి కు ప్రభుత్వం భూ సేకరణ చేయడం జరిగింది అని, పట్టణానికి దగ్గరగా భూములు కలిగిన  ఉన్న రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో రైతులకు  అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం  ఎకరాకు 25 లక్షలు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని, కానీ  అక్కడ బహిరంగ మార్కెట్లో భూమి విలువ  సుమారు 75 లక్షలుగా ఉన్నదని దీనివలన భూమి కోల్పోయిన రైతులు న్యాయం చేయవలసిందిగా అర్జీలు రూపంలో మా దృష్టికి తీసుకురావడం జరిగిందని  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. తగు విచారణ జరిపి భూ సేకరణ విషయంలో, భూమి కోల్పోయిన రైతులకు నష్టం జరగకుండా  న్యాయమైన పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని  ఆయన కోరారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)