కందుకూరు జర్నలిస్టుల అసోసియేషన్ (KJA) నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షలుగా యర్రంశెట్టి ఆనందమోహన్
ప్రధాన కార్యదర్శిగా
ద్రోణాదుల చైతన్య
కోశాధికారిగా డాక్టర్ చక్కాకేశవరావు లు ఏకగ్రీవం
31 మందితో కమిటీ ఎన్నిక
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని స్వర్ణ ప్యాలస్ లో కందుకూరు జర్నలిస్టుల అసోసియేషన్ (KJA) నూతన కమిటీని 31 మందితో ఏర్పాటు చేయటం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా యర్రమాల నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గౌడ పేరు రాము, గౌరవ ముఖ్య సలహాదారులుగా డాక్టర్ పసుపులేటి పాపారావు, అధ్యక్షులుగా యర్రంశెట్టి ఆనందమోహన్, ఉపాధ్యక్షులుగా బొజ్జ చంద్రమోహన్( కందుకూరు), కళ్యాణ్ ( గుడ్లూరు), పర్రే ప్రసాద్ ( ఉలవపాడు), ప్రభాకర్ (కందుకూరు), వెంగళరావు (వలేటివారిపాలెం), ప్రధాన కార్యదర్శిగా ద్రోణాదుల చైతన్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా కొండాబత్తిన కృష్ణ, సహాయ కార్యదర్సులు గా ద్రోణాదుల సురేష్ (కందుకూరు), సుధాకర్ (గుడ్లూరు), దాసరి శ్రీనివాసులు (ఉలవపాడు) ద్రోణాదుల అజయ్(కందుకూరు), మోహన్ (కందుకూరు), కోశాధికారిగా డాక్టర్ చక్కా కేశవ రావులతో పాటు మారో 14 మందితో నూతన కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు యర్రంశెట్టి ఆనందమోహన్, ద్రోణాదుల చైతన్య లు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కందుకూరు జర్నలిస్టు అసోసియేషన్ సొంత ప్రయోజనాలకు తావివ్వకుండా కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం పని చేస్తుందని వారు తెలిపారు. త్వరలోనే కందుకూరులో ప్రెస్ క్లబ్ ను ఏర్పాటు చేయటం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల విలేకరులు పాల్గొన్నారు.

