అతివేగాన్ని నిరోధిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు - ఎస్సై వి. సాంబశివయ్య
BSBNEWS - KANDUKUR [18.10.2024]
వాహనాలు నడిపేటప్పుడు అతివేగాన్ని నిరోధిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని పట్టణ ఎస్సై వి.సాంబశివయ్య తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ లో వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు పట్టణ ఎస్సై సాంబశివయ్య రోడ్డు ప్రమాదాలు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణించడం, అంగవైకల్యానికి గురికావడం జరుగుతుందని, దానికి ప్రధాన కారణం అజాగ్రత్త, నిర్లక్ష్యం ధోరణి అన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్ధన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని అన్నారు. ఎవరికైనా లైసెన్సులు పత్రాలు లేనియెడల వారి వాహనాలను సీజ్ చేయటంతో పాటు, జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఓక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం ఆ వ్యక్తి యొక్క ప్రాణానికేక ఇతరుల ప్రాణాలుకు ముప్పు తీసుకొని వస్తుందని, ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని కోరారు. మైనారిటీ తీరని పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే వాహన యజమానులకు శిక్షార్హులు అవుతారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపిన, మద్యం సేవించి వాహనాలు నడపినా జరిమానాలతో పాటు జైలు శిక్షకు బాధ్యులు కాగలరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

