మునగాకు శరీరానికి పోషణ ఇస్తుంది - సిడిపిఓ శర్మిష్ట

0

మునగాకు శరీరానికి పోషణ ఇస్తుంది - సిడిపిఓ శర్మిష్ట 

BSBNEWS - KANDUKUR [18.10.2024]


 ప్రతి ఒక్కరూ మునగాకును ప్రతిరోజు ఆహారంగా విధిగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషణ లభిస్తుందని సిడిపిఓ శర్మిష్ట అన్నారు. పట్టణంలోని కేసరిగుంట కాలని అంగన్వాడి కేంద్రము నందు శుక్రవారం మోరింగా ఫెస్టివల్ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిడిపిఓ శర్మిష్ట మాట్లాడుతూ మునగాకు వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లతో నిండి ఉంటాయని, ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ కలిగి ఉంటాయన్నారు. మునగాకు తీసుకోవడం వలన విటమిన్ సి, ఇతర పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయన్నారు. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయన్నారు. రక్త మునగాకులో ఉండే పోషకాలు రక్త పీడనాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయన్నారు. మునగాకును ప్రామాణికంగా తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు అని తెలిపారు. మునగాకులోని పోషకాలు జుట్టు పెరుగుదల, జుట్టు ఒత్తును మెరుగుపరుస్తాయని, జుట్టు రాలడం తగ్గిస్తుందని వివరించారు. కరివేపాకు యొక్క  ప్రయోజనములను కూడా తల్లులకు, గర్భవతులకు తెలియజేశారు. అనంతరం అంగన్వాడి కేంద్రము ఆవరణలో మునగ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమములో యానాది పాలెం ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, సూపర్వైజర్ లు ప్రభావతి, లక్ష్మిదేవమ్మ, సునీత, అంగన్వాడి కార్యకర్త సుభాషిణి, తల్లులు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)