పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలి - మున్సిపల్ కమిషనర్ కే.అనుష
BSBNEWS - KANDUKUR [18.10.2024]
కందుకూరు పురపాలక సంఘం పరిధిలో ప్రతి ఒక్కరూ ఇంటి పన్నులు కులాయి పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కే అనుష అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో 16 సచివాలయల అడ్మిన్ సెక్రేటరీలతో ఇంటి పన్నులు, నీటి పన్నుల బకాయిలపై సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ 2024 -2025 సంవత్సరమునకు సంబంధించి ఇంటి పన్నులు, నీటి పన్నులు బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. చెల్లించిన యెడల 1965 యాక్ట్ ప్రకారం వారి యొక్క నీటి కుళాయి కనెక్షన్ తొలగించడంతో పాటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు. అడ్మిన్, సెక్రేటరీలు పన్ను బకాయిల పై దృష్టి సారించి పన్నులు వసూలు చేయుటకు తగు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. అన్ని రకాల పన్నుల బకాయి దారుడు వెంటనే పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధి కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్.ఐ రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

