భాషాప్రయుక్త రాష్ట్రం కోసం కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు - ఎమ్మెల్యే ఇంటూరి
ఘనంగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమం
BSBNEWS - కందుకూరు
నియోజకవర్గంలోని గుడ్లూరు, కందుకూరు పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ కొరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి కోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములని తెలిపారు. మద్రాస్ ప్రెసిడెంట్ రాష్ట్రంలో తెలుగువారు పడుతున్న ఇబ్బందులు చూసి తెలుగువారి ఐక్యత కోసం పోరాడి, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తెలుగువారి అస్తిత్వాన్ని ఎలిగేత్తి చాటి, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ సంస్కరణ దినంగా ప్రకటించిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గ ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, ఆర్యవైశ్య నాయకులు తాతా లక్ష్మీనారాయణ, మురారి శెట్టి సుధీర్ కుమార్, గుర్రం అల్లూరయ్య, మురారిశెట్టి సుబ్బారావు, కొత్త వెంకటేశ్వర్లు కోట వెంకట నరసింహం, కాకుమాని ప్రవీణ్, చీదేళ్ళ పిచ్చయ్య, కొత్తూరి శ్రీనివాసులు, అమర మాల్యాద్రి, ఇన్నమూరి శ్రీనివాసులు, పార్టీ నాయకులు చిలకపాటి మధుబాబు, వడ్డెళ్ళ రవిచంద్ర, ముచ్చు శ్రీను, బెజవాడ ప్రసాద్, చదలవాడ కొండయ్య, షేక్ రఫీ, ముచ్చు వేణు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.