అనధికారికంగా ఫ్లెక్సీ హోడింగ్ నిర్మాణం - అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

0

అనధికారికంగా ఫ్లెక్సీ హోడింగ్ నిర్మాణం 

స్థానికుల సమాచారంతో అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది

BSBNEWS - కందుకూరు 

పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంప్లెక్స్ పైన అనధికారికంగా ఫ్లెక్సీ హోడింగ్ నిర్మాణము చేపడుతున్నారు. దాంతో స్థానికులు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వెంటనే  హోడింగ్ నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఇవే కాకుండా పట్టణంలో అనధికారికంగా అనేక ఫ్లెక్సీలు వెలుస్తున్నాయని వాటితో ట్రాఫిక్ కు సైతం పలుచోట్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ ను వివరణ అడగగా మున్సిపల్ పరిధిలో ప్లెక్సీలకు హోల్డింగ్ ద్వారానే అనుమతులు ఇస్తున్నామని అనుమతులు లేని వాటిని తొలగిస్తామని ఆమె తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)