వరికి ఉరిగా మారిన రాళ్లపాడు ప్రాజెక్ట్ నిర్వహణ..

0

 వరికి ఉరిగా మారిన రాళ్లపాడు ప్రాజెక్ట్ నిర్వహణ.. 

అధికారులు, ప్రభుత్వము నిర్లక్ష్యం వీడి కుడి కాలవ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి.

కుడి కాలవ ద్వారా  నీరు విడుదల చేసి రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలి.

- బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్.

BSBNEWS - కందుకూరు 

రాళ్లపాడు రైతాంగ దుస్థితి చూస్తే కడుపు తర్కపోతుందని, ప్రాజెక్టు నిండు గర్భిణిలా నీటితో నిండి ఉన్నా కూటమి ప్రభుత్వం, రాళ్లపాడు ప్రాజెక్టు నిర్వహణ అధికారుల నిర్లక్ష్యం వలన రైతాంగం వేసిన వరి నారమళ్ళు ఎండిపోతున్న దుస్థితి కనబడుతుంది అని వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి రాళ్లపాడు రైతాంగం చల్లిన వరి నారు ఎండిపోకుండా ఫైర్లు వేసుకోవడానికి  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరు అందించాలని మాజీ శాసనసభ్యులు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా. మధుసూదన్ యాదవ్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులో ఇప్పటికీ  20 అడుగులు నీళ్లు చేరి నిండుకుండలా ఉన్నప్పటికీ పొలాల్లోకి చుక్కనీరు రాని కారణంగా, నార్లు ఎండి పోతున్నాయి అని,  ఫైర్లు వేసుకోవాలో లేదో అర్థం కాక  విలవిలలాడిపోతున్నామని రైతులు ఆవేదన గత వారం రోజులుగా ప్రాజెక్ట్ కట్టపై కళ్ళకు కనపడుతుంది అని, కూటమి ప్రభుత్వం కళ్ళుండి  కబోది లాగా రైతాంగం పట్ల వ్యవహరిస్తుంది అని అన్నారు. రాళ్లపాడు రైతాంగానికి ప్రభుత్వము అజమాయిషిలేని తనం శాపంగా మారిందని, ప్రాజెక్టు నిర్వహణ అధికారులు నిర్లక్ష్యం వలన సీజన్ నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నారుమళ్ళు ఎండిపోకుండా, పైర్లు నాటుకునే దానికి  తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రాజెక్టు ఆయకట్టు కింద వేల ఎకరాల సాగు జరుగుతుందని ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్వహణకు అధికారులు ప్రభుత్వం చూపుతున్న సవతి ప్రేమ సరైనది కాదని, వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేసి రైతాంగాన్ని ఆదుకోకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని పేర్కొన్నారు. తుఫానులు కారణంగా విస్తారంగా వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీరు చేరుతుంటే విరిగిపోయిన గేట్లను మరమ్మత్తులు చేసుకోకుండా, కాలువలను బాగు చేయకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉన్నారంటే రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఎటువంటి శ్రద్ధాశక్తులు లేవని అర్థమవుతుందని అన్నారు. గత వారం రోజుల నుండి గేట్లు విరిగిపోయిన కారణంగా, కుడి కాలవ నుండి నీరు పారుదల లేక, రైతులు పైర్లు వేసుకోలేక అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈదుస్థితికి కారణమైన అధికారులపై తగిన చర్యలకు డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతాంగం పట్ల అధికారులకు పాలకవర్గాలకు చిత్తశుద్ధి లోపించింది అనేదానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, గేట్లు ఎత్తటానికి, రాష్ట్రంలోని నిపుణులను రప్పించి మరమ్మత్తుల చేయించాలి అని, అప్పటి దాకా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కుడి కాలువ ద్వారా నీరు అందించి నారు కయ్యలు, వరిపైర్లు ఎండిపోకుండా రాళ్లపాడు రైతాంగాన్ని ఆదుకోవాలని  డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)