రైతులు ఆందోళనకు అధికారుల నిర్లక్ష్యమే కారణం - బూసి సురేష్ బాబు
(సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి)
BSBNEWS - కందుకూరు
రాళ్లపాడు ప్రాజెక్టు అధికారులకి పలుమార్లు సిబ్బందిని పెంచాలని తద్వారా గేట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని పదేపదే చెప్పిన వారి పట్టించుకోకపోవడం వలన ఈ పరిస్థితి నెలకొందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సిబ్బంది లేకపోవడం వలన గేట్లు తుప్పు పట్టి విరిగిపోయే పరిస్థితి వచ్చిందని, ముందుగా చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణమని దుయ్యబట్టారు. చేపల మాఫియా ను అరికట్టి రైతాంగంకు న్యాయం చేసేంతవరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున రైతులకు మద్దతు తెలిపి పోరాటం చేస్తామని అన్నారు.