నేషనల్ ఓటర్స్ డే నిర్వహించిన సబ్ కలెక్టర్

0

 నేషనల్ ఓటర్స్ డే నిర్వహించిన సబ్ కలెక్టర్ 

BSBNEWS - KANDUKUR


కందుకూరు పట్టణంలో జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే పురస్కరించుకొని విద్యార్థులతో కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటును హక్కుగా వినియోగించుకోవాలని, మన ఓటు మన జీవితాన్ని శాసిస్తుందని ఆమె అన్నారు. ప్రతి ఒక్క పౌరుడికి ఓటు ఎంతో విలువైనదని అశ్రద్ధతో దానిని వినియోగించకుండా ఉంటే దాని పర్యవసానం మన, మన పిల్లల భవిష్యత్తుపై పడుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.అనూష, తహశీల్దార్ ఇక్బాల్, తదితర అధికార సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)