శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న బుర్ర
BSBNEWS - వలేటివారిపాలెం
మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీలో వెలసియున్న శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని కనిగిరి మాజీ శాసనసభ్యులు కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బుర్ర మధుసూదన్ యాదవ్ జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు వసతులు సక్రమంగా ఉన్నాయా లేవా అని పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు. బుర్ర మధుసూదన్ యాదవ్ వెంట తోకల కొండయ్య గణేశం. గంగిరెడ్డి, వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అను మో లు లక్ష్మీనరసింహం, కందుకూరు మండల పార్టీ అధ్యక్షుడు ఈదర. రమేష్, గుత్తా. గోపి, ఇరపని.అంజయ్య, దాసరి. మాల్యాద్రి, నల్లబోతుల చంద్రమౌళి, టెంకం కొండలరావు, సప్పిడి. రాధాకృష్ణ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.