కందుకూరులో దొంగల బీభత్సం
10 సవర్ల బంగారం చోరీ
BSBNEWS- KANDUKUR
కందుకూరులో వరుస దొంగతనాలతో ప్రజలు హడలెత్తుతున్నారు. ఇటీవల వాసవి నగరంలో జరిగిన దొంగతనం మరవకముందే పట్టణంలోని గ్రంధాలయం వీధిలో ఉన్న పసుపులేటి రాజేశ్వరి ఇంట్లో గురువారం రాత్రి దొంగలు బీభత్సం చేశారు. ఇంటి యజమాని తెలిపిన వివరాల ప్రకారం గురువారం నాడు సింగరాయకొండ లో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లడం జరిగిందని శుక్రవారం ఉదయం ఇంటి ఎదురుగా ఉన్న వారు మీ ఇంటిలో దొంగలు పడ్డారని నాకు ఫోన్ చేయటంతో మా ఇంటికి రావడం జరిగిందని తీరా చూస్తే ఇంటిలో ఉన్న బీరువా తాళాలు పగలగొట్టి ఉన్నాయని, అందులో ఉన్న పది సవర్ల బంగారం, పదివేల రూపాయల నగదు, వెండి పట్టీలు పోయినట్లుగా తెలుసుకున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న కందుకూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.