విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతికి శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మచారి

0

 విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతికి శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మచారి

BSBNEWS - కందుకూరు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులు అయిన కమ్మరి పార్వతికి కందుకూరు విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి  బొల్లోజుల బాల బ్రహ్మచారి ఒక ప్రకటనలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక రంగాల్లో వెనుకబడుతున్న విశ్వబ్రాహ్మణ నాయకులకు, కార్మికులకు అండగా ఆమె నిలవాలని కోరారు. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు పడుతున్న సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేయాలని అన్నారు. కందుకూరులో ఉన్న విశ్వబ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా ఆమె ఒకసారి పర్యవేక్షించాలని కోరారు. విశ్వబ్రాహ్మణ సంఘం అభివృద్ధి బాటలో ఆమె నడిపిస్తారని పూర్తి విశ్వాసం మాకు ఉందని ఆయన తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)