శ్రీ స్కందపురి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి దంపతులు

0

 శ్రీ స్కందపురి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి దంపతులు

అభిషేక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

BSB - news  KANDUKUR



పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఆయన సతీమణి సౌజన్య గంగా సమేత స్కందపురి సోమేశ్వరాలయంలో స్వామివారికి జరిగిన వేకువజామున అభిషేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే దంపతులు కార్తీక దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ముందు ఏర్పాటుచేసిన శివలింగమూర్తికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, స్వామి వారి శేష వస్త్రాన్ని అందజేశారు. పట్టణ ఆర్యవైశ్యులు ఏర్పాటుచేసిన   ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని స్వయంగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి రవికుమార్, టిడిపి పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్, కొత్త వెంకటేశ్వర్లు,చక్కా వెంకట కేశవరావు, కోటా కిషోర్ బాబు, కంకణాల వెంకటేశ్వర్లు, ఓరుగంటి శివశంకర్, మురారిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)