దున్నపోతుకు అంగన్వాడీలు అర్జీ..!!

0

 దున్నపోతుకు అంగన్వాడీలు అర్జీ..!!

(తోటపల్లిగూడూరు డిసెంబర్ 31 BSBNEWS)


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పడంపై దున్నపోతుకు అర్జీ ఇచ్చి అంగన్వాడీలు వినూతనంగా నిరసన తెలిపారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్స్ సాధన కొరకు జరుగుతున్న 20 వ రోజు సమ్మె లొ బాగంగా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులో ఆదివారం అంగన్వాడీలు దున్నపోతుకి అర్జీ ఇచ్చారు. ఈ సందర్బంగా అంగన్వాడి వర్కర్స్ జిల్లా కార్యదర్శి రహనబెగం మాట్లాడుతూ సీఎం జగ న్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార పాదయాత్రలో అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం పెంచుతానని మాట ఇచ్చి త ప్పారన్నారు. ఇదేనా మాట తప్పని, మడమ తిప్పని సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అని ఏద్దేవా చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యువిటి అమలు చేయాలని రెహానా బేగం డిమాండ్ చేశారు. అలాగే రి టైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాల న్నారు. అదేవిదంగా వేతనంలో సగం పెన్షన్ ఇ వ్వాలని ఆమె సూచించారు. ఎఫ్.ఆర్.యస్  రద్దు చేయాలని, అన్ని యాప్ లు కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడి, ఆ యా కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, భీమా అమలు చేయాలన్నారు.  పెండింగ్ లో అంగన్వాడీ సెంటర్ల అద్దె లు, 2017 టీఏ బిల్లు లు ఇతర బకాయిలు వెంటనే విడుదల చేయాల ని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు నా ణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలన్నారు. అలాగే ఫ్రీ స్కూల్స్ బలోపే తం చేయాలని రహేన బేగం కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మారుబోయిన రాజా, భోజన కార్మికులు 


తదితరులు పాల్గొ న్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)