కందుకూరు డిసెంబర్ 30 BSBNEWS
ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభ జనవరి 2 న నెల్లూరు లో జరుగుతుందని రైతు సంఘం జిల్లా కన్వీనర్ సాన్వాజ్ తెలిపారు. కోటారెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ శాన్వాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అది మర్చిపోయిందని రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాయితీలో ఎరువులు ఇస్తామని అదేవిధంగా రుణమాఫీలు చేస్తామని అనేక హామీలు ఇచ్చి రైతులను నిలువున నట్టేట్లో ముంచిందని అన్నారు. ఇప్పటికే అనేక మంది రైతులు తాను పండిం చిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాక చనిపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులను ఆదుకొని రైతు పంటకి గిట్టుబాటు ధర కల్పించి ,బ్యాంకు రుణాలు ఇప్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనవరి 2 న నెల్లూరులో ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభ జరుగుతుందని ఈ మహాసభలో రైతులు పడుతున్న ఇబ్బందులు మీద చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు. రైతులందరూ పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు, రైతు సంఘం నాయకులు ఎం లక్ష్మీనారాయణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దర్గా బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై ఆనంద్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

