వాహనాలపై ఏ తాలూకా సంబంధించిన స్టిక్కరింగ్ పేర్లు తొలగించకపోతే 10 వేలు జరిమాన - జిల్లా ఎస్పీ దామోదర్

0

వాహనాలపై ఏ తాలూకా  సంబంధించిన స్టిక్కరింగ్ పేర్లు తొలగించకపోతే 10 వేలు జరిమాన - జిల్లా ఎస్పీ దామోదర్ 

BSBNEWS - PODILI

పొదిలి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనం నెంబర్ ప్లేట్లపై  విచిత్రమైన స్టిక్కరింగ్ పేర్లు ఉంటే తొలగించాలన్నారు. వాహనాలపై ఏ తాలూకా  సంబంధించిన స్టిక్కరింగ్ పేర్లు ఉండకూడదన్నారు. అలా స్టిక్కరింగ్  తీయకుండా, వినకుండా ఉంటే పదివేల రూపాయలు జరిమానా విధించండం జరుగుతుంది అని అన్నారు. ఈవ్ టీజింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచనలు చేశారు. డ్రంక్ అండ్ డ్రై టెస్టులు ముమ్మరంగా నిర్వహించాలని, ఎవరిని వదలవద్దు అని అన్నారు. పోలీసు నియమ నిబంధనలను అతిక్రమిస్తే సహించవద్దని అన్నారు. ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందంటూ దానిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)