బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు పండించాలి - పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్

0

 బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు పండించాలి - పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్


BSBNEWS - KANDUKUR




బోర్డు ఇచ్చిన పరిమితి మేరకే పొగాకు పండించాలి అని, పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ అన్నారు. శుక్రవారం పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబుతో కలిసి కందుకూరు 1 & 11  కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు పొగాకు వేలం ను పరిశీలించి కంపనీ ప్రతినిధులను మంచి ధరలు ఇవ్వాలని కోరారు. అనంతరం రైతు సోదరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ 2023-24 పంట కాలానికి ఆథరైజ్డ్ కోటాకి మించి పండించిన పొగాకు అపరాధ రుసుము లేకుండా వేలం కేంద్రం లో అమ్ము కోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని తెలిపారు. ఇది ఈ ఏడాదికి మాత్రమే అని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ దృష్టిలో ఉంచుకుని అధిక ధరలకు పొలాలు, బారన్ లు లీజుకు  తీసుకోవద్దని వచ్చే ఏడాది మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేమని అందుకే బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే పొగాకు పండించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు పొగాకు బోర్డు చైర్మన్ కి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబుకి, వైస్ చైర్మన్ శ్రీ గుత్తా వాసు బాబుకి అధికంగా పండించిన పొగాకు అపరాధ రుసుము లేకుండా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు పొగాకు బోర్డు చైర్మన్ ని, వైస్ చైర్మన్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణ అధికారి కె. రాజగోపాల్ రెడ్డి, రైతు సోదరులు, ట్రేడ్ మిత్రులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)