టిఆర్ఆర్ జూనియర్ కళాశాలకు 10 వేలు విరాళం అందించిన కాలేజ్ టాపర్ అఖిల
BSBNEWS - KANDUKUR
పట్టణంలోని తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గత సంవత్సరము ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కాలేజీ టాపర్ గా నిలిచిన బసిరెడ్డి పాలానికి చెందిన కుడుముల అఖిల వారి తల్లిదండ్రులు శనివారం కళాశాలకు 10వేలు విరాళం అందజేసి తమ ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత సంవత్సరం కళాశాల నందు ఎంపీసీ గ్రూపు చదివి కళాశాల టాపర్ (966 మార్కులు సాధించిన)గా నిలిచిన కుడుముల అఖిల కళాశాలలో ఎవరైనా విద్యార్థులు ఫీజులు కట్టలేని వారు ఉన్నచో వారికి తోడ్పాటునందించుటకు అఖిల తల్లిదండ్రులు పదివేల రూపాయల నగదును కళాశాలకు అందజేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు గుర్తించి వారి జూనియర్స్ కి ఉపయోగించమని తెలపటం గొప్ప విషయమని అన్నారు. అఖిల తల్లి బసిరెడ్డి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ గా పనిచేస్తూ ప్రభుత్వ కళాశాలలో వారి కుమార్తెను చదివించటం గర్వకారణం అని అభినందనలు తెలియజేశారు. అఖిల తండ్రి రమేష్ రెడ్డి మాట్లాడుతూ చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కార్పోరేట్ కళాశాల మోజులో పడి డబ్బులు వృధా చేసుకుంటున్నారని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు చదువు క్రమశిక్షణ చాలా బాగా ఉన్నదని అందువలననే మా కూతురికి 966 మార్కులు సాధించి మా గ్రామం నందు చదువుకుంటున్న విద్యార్థులందరిలో మెరుగైన మార్కులు సాధించినదని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గణిత అధ్యాపకులు కాశీరత్నం, భౌతిక శాస్త్రం అధ్యాపకురాలు మాధవి, రసాయన శాస్త్రం అధ్యాపకులు రాజశేఖర్, హిందీ అధ్యాపకురాలు పరుచూరి ఉష మిగిలిన అధ్యాపకు సిబ్బంది విద్యార్థినికి అభినందనలు తెలిపారు.