పింఛన్ల పంపిణీకై మూతపడ్డ సచివాలయం
BSBNEWS - KANDUKUR
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ ఒకటవ తేదీ నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పింఛన్ లను పంపిణీ ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు మొదటి రోజునే ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్ లను అందించాలని మిగిలినవి ఏవైనా ఉంటే మరుసటి రోజు పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగస్తులు తోపాటు అంగన్వాడీ కార్యకర్తలు కూడా పింఛన్లు పంపిణీలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉంటే పింఛన్లు పంపిణీ కోసం సచివాలయాలు సైతం తాళాలు వేసి పింఛన్లు పంపిణీ చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికై సచివాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. సచివాలయాలు పూర్తిగా తాళాలు వేయటంతో పింఛన్ల పంపిణీ కారణంగా సచివాలయాలకు సెలవులు ప్రకటించారని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయమై కందుకూరు ఎంపీడీవో ప్రమీలా రాణి ని వివరణ అడగగా ప్రతి నెల ఒకటో తేదీ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమం లో సచివాలయ ఉద్యోగస్తులు నిమగ్నమై ఉంటున్నారని ఆ సందర్భంలో సచివాలయాలకు తాళాలు వేయటం తప్పు కాదని అలా తాళాలు వేయకపోతే సచివాలయంలో ఉండే సామాగ్రి పోయే ప్రమాదం ఉందని చెప్పటం గమనార్హం.