విశ్వ నరుడు జాషువాకు ఘన నివాళులు

0

విశ్వ నరుడు జాషువాకు ఘన నివాళులు.

BSBNEWS - KANDUKUR

మహాకవి, కవి కోకిల, పద్మ విభూషణ్, గబ్బిలం కావ్య సృష్టికర్త, విశ్వనరుడు గుర్రం జాషువా 73వ వర్ధంతి సందర్భంగా జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుద్ధ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం వద్ద ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా సాహిత్య సేవలను పలువురు వక్తలు కొనియాడారు. కుల మతాలు గీచిన గీతలజొచ్చి పంజరాన కట్టువడను నేను నిఖిలలోక మెట్లు నిర్ణయించిన తరుగు లేదు నాకు విశ్వనరుడును నేను అని గర్వంగా ప్రకటించుకున్న సాహితీ ధ్రువతార గుర్రం జాషువా అని, పేదరికం ఆకలి నా గురువులని ఎంచి కవిత్వంలో ఎంత కోయిల పాట వ్యధయయ్యెనో కదా చిక్కుచీకటి వనసీమలందు, యెంత రత్నకాంతి యెంత శాంతి ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో పుట్టరానిచోట పుట్టుకతన అని తన కవిత్వానికి అస్పృశ్యత లేదు కనుక కవిగా చూసిన అస్పృశ్యత  సమాజంలో సభ్యుడే కనుక అతను అస్పృశ్యుడే అని సమాజం ఆయన్ని దూరం పెట్టింది అని, జీవిత పర్యాంతరం ఆయనలో ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉందని  వక్తలు మాట్లాడారు. జాషువా సాహిత్యం లోకానికి  వెలుగు పంచిన దివిటి లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు,పాలపిట్ట ధీర్గ కావ్వ రచయిత  ముప్పవరపు కిషోర్, దమ్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల హరి ప్రసాదు, మాజీ కౌన్సిలర్ రేణమాల అయ్యన్న, పలనాటి వీరాచార జానపద కళాకారులు కిన్నెర బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)