బాల్య మిత్రునికి శుభాకాంక్షలు తెలిపిన తన్నీరు బాలాజి.
BSBNEWS - KANDUKUR
కందుకూరు రాజకీయ చదరంగంలో ఎన్నో ఆటుపోట్లు చవిచూసి, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ, ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి తన్నీరు బాలాజీ శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బాల్య స్నేహితుడైన ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో ముందెన్నడూ లేని విధంగా నూతన ఒరవడిని ప్రారంభించి అఖండ మెజారిటీని సొంతం చేసుకొని కందుకూరు చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజా బంధు, దయా సింధు, బడుగు బలహీన వర్గాలకు ఆపద్బంధు, మృదుస్వభావి నా మిత్రుడు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కందుకూరు శాసనసభ్యులుగా ఇంటూరి నాగేశ్వరరావు గెలవడం కందుకూరు అభివృద్ధికి నాంది అని అన్నారు. అత్యధిక సంఖ్యాకుల ఆశలు, ఆశయాలు ఆయన పాలనలో ప్రతిఫలింప చేస్తారని ఆశిస్తూ, నమ్రత, ఔదార్యం, క్రియాత్మకత వంటి లక్షణాలు కలిగిన గొప్ప నాయకుడు ఇంటూరి నాగేశ్వరరావు అని కొనియాడారు. నిత్య అధ్యయనం, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం, ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహరించే సలక్షణాలు కలిగిన మంచి వ్యక్తి ఇంటూరు నాగేశ్వరరావు అని, ఆయన పాలన ప్రజా రంజకంగా కొనసాగిస్తూ గొప్ప పరిపాలన దక్షుడు గా కందుకూరుని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం తమ మిత్రులు ఇంటూరి నాగేశ్వరరావు ను దుశ్శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శశి కుమార్ పాల్గొన్నారు.

