డిగ్రీ రెండవ దశ ఆన్ లైన్ ప్రవేశాలు ఆగస్ట్ 22 నుండి ప్రారంభం
కళాశాలలో చేరే ప్రతి విద్యార్థికి 2000 రూపాయల ఫీజు ఉచితం
BSBNEWS - కందుకూరు ఆగస్టు 20
ఏపీ ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు. ఈనెల 22వ తేదీ నుండి డిగ్రీ రెండో దశ ఆన్లైన్ అడ్మిషన్లు మొదలవుతాయని టీ.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాల ప్రిన్సిపాల్, డా. యం. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.కళాశాలలో చేరాలనుకున్న విద్యార్థులు ఈనెల 22 నుండి 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. అలాగే 23వ తేదీ నుండి 25 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. 29వ తేదీన రెండవ దశ సీట్ల కేటాయింపు జరుగుతుందని, సెప్టెంబర్ మూడవ తేదీ లోపు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. బీ ఏ, బీఎస్సీ, బీకాం కోర్సుల్లో ఖాళీలు కలవని తెలిపారు.అలాగే మొదటి సంవత్సరం ప్రవేశం పొందే పేద విద్యార్థులు వారి చదువు ఆటంకం లేకుండా కొనసాగించేందుకు వారు కట్టే ఫీజులో రెండు వేల రూపాయల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ రాయితీ సొమ్మును కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది భరిస్తారని తెలిపారు.