గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమంను ప్రారంభించిన సర్పంచ్ ఆవుల మాధవరావు

0

 గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమంను ప్రారంభించిన సర్పంచ్ ఆవుల మాధవరావు

BSBNEWS - KANDUKUR


మండలంలోని కోవూరు పశు వైద్య కేంద్రంలో గాలి కుంటు నివారణ టీకాల కార్యక్రమం ను కోవూరు గ్రామ సర్పంచ్ ఆవుల. మాధవరావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు గ్రామ పశు పోషకులు అందరూ ఈ ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మేలైన యాజమాన్య పద్ధతులతో పాల దిగుబడి పెంపోందించుకొని రైతులు ఆర్ధికంగా లాభపడాలని కోరారు. కోవూరు పశు వైద్యులు డాక్టర్. యస్. సుధాకర్ మాట్లాడుతూ గాలి కుంటు వ్యాధి అప్తా వైరస్ వల్ల పికర్నో విరిడే అనే వెరియంట్ వలన వస్తుంది అని, అంటు వ్యాధి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది అని అన్నారు. కోవూరు పశు వైద్య కేంద్రం పరిధిలో ఉన్న 10 పంచాయతీ లలో ఈనెల ఆగస్టు 20వ తేది నుండి సెప్టెంబర్ 12వ తేది వరకు  కోవూరు, పందలపాడు, జిల్లలముడి, కొండికందుకూరు, నరిశెట్టివారిపాలెం,


పలుకూరు, విక్కీరాలపేట, బలిజపాలెం, కమ్మవారిపాలెం, జి. మేకపాడు గ్రామాలలో రైతు సేవా కేంద్రంలో ఉన్న పశు వైద్య సహాయకులు ప్రతి ఇంటిలో ఉన్న గేదలు, తెల్ల పశువులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలు ప్రతి రైతు తప్పనిసరిగా వేయించుకోవాలని తెలియజేసారు. గాలి కుంటు వ్యాధి సోకితే జ్యరం, రావటం నోటిలో కాళ్ళ మధ్యలో పుండ్లు రావటం, చూడి గేదలు అబోర్షన్స్ అవటం, దూడలు చనిపోవటం, పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుందన్నారు. దాని వలన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.  వాటిని నివారించాలంటే అందరూ తప్పనిసరిగా తమ పశువులకు టీకాలు వేయించుకువాలని అన్నారు. ఈ కార్యక్రమం లో  నాదెళ్ల. రమణయ్య, జిల్లముడి రవికుమార్ ,కోవూరు. గోపాలక్రిష్ణ మూర్తి, పశు పోషకులు, కోవూరు పశు వైద్య కేంద్రం సహయకులు జి. విజయ్ సాగర్, రైతు సేవా కేంద్రం సహాయకులు, వి. వేణు, ఎన్. లోకెష్ కుమార్, పి. జయ సుహాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)