అఖిల భారత స్థాయిలో రాణించిన టి ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి
BSBNEWS - కందుకూరు ఆగస్టు 20
టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బి.ఏ, విద్యార్థి కూచిపూడి గోపీచంద్,ఎన్ సి ఈ ఆర్ టి నిర్వహించిన అఖిల భారత ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, బి.ఎడ్(ఆర్ట్స్) విభాగంలో ఆల్ ఇండియా 204 వ ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీలో 4 ర్యాంకు సాధించిన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రవికుమార్ తెలిపారు. ఒక సామాన్య గ్రామీణ ప్రాంత కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థి అఖిల భారత స్థాయిలో ఈ విధంగా రాణించటం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అభినందించారు. వెంటనే వెయ్యి రూపాయల నగదు పారితోషికాన్ని కూడా అందించారు.టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం అఖిలభారత స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోను పోటీ పరీక్షల్లో రాణించి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత సంవత్సరం ప్రతిష్టాకరమైన ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ( ఈ ఎఫ్ ఎల్ యు) , హైదరాబాద్ నందు కళాశాల స్పెషల్ ఇంగ్లీష్ విద్యార్ధిని, షర్ఫున్నీసా బేగం సీటు సాధించిందని,సింధుజా అనే విద్యార్థిని రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మైసూర్ లో ఆంగ్ల విభాగంలో రాష్ట్రస్థాయిలోనే మొదటి ర్యాంకు సాధించి సీట్లు పొందారని గుర్తు చేశారు. కూచిపూడి గోపీచంద్ ను కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించగా, గోపీచంద్ మాట్లాడుతూ కళాశాలలో అధ్యాపకుల బోధన, ప్రిన్సిపాల్ గైడెన్స్, తల్లిదండ్రుల ప్రోత్సాహం వలన ఈ విజయం సాధించానని, టి.ఆర్.ఆర్.ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే విధంగా విద్యాబోధన ఉంటుందని తెలిపాడు. టిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఉన్న అధ్యాపకుల బోధనానుభవాన్ని, సౌకర్యాలను కందుకూరు పరిసర ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు వినియోగించు కోవాలని, ఈ కళాశాలలో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా కోరారు.