ఘనంగా మూడో రోజు తల్లిపాలు వారోత్సవాలు

BSBNEWS - KANDUKUR
మండలంలోని కమ్మపాలెం అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు మూడోరోజు అంగనవాడి సూపర్వైజర్ యు.ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి బిడ్డకు తల్లి ఎంత ముఖ్యమో తల్లి పాలు కూడా బిడ్డకు అంతే ముఖ్యం అని, తల్లిపాల వలన పిల్లలు పౌస్టికంగా ఉంటారని అన్నారు. తల్లి పిల్లలకు పాలు ఇవ్వడం వలన వారికి ఎటువంటి నష్టం కలగదు అని కొంతమంది నేటి పరిస్థితులలో పిల్లలకు పాలు ఇస్తే తమకు పలు రకాలు ఇబ్బందులు తలెత్తుతాయని అపోహలో పిల్లలకు పాలు ఇవ్వకుండా దూరం పెడుతున్నారు అని, అలా చేయటం వలన పిల్లలు బరువు తక్కువగా బలహీనంగా ఉంటున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతి తల్లికి పిల్లలకు పాలు ఇచ్చే విషయంలో ఉన్న అపోహలు పోయేలా అవగాహన కార్యక్రమం చేపడుతుందని ఆమె తెలిపారు. తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనే ప్రతి తల్లులు శ్రద్దగా వింటున్నారని వారిలో మార్పు తప్పకుండా వస్తుందని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని ప్రతి గర్భవతి, బాలింత తప్పకుండా ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు.