ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: సిఐ. కే వెంకటేశ్వర రావు
BSBNEWS - KANDUKUR 22.08.2024
పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ . కే వెంకటేశ్వర రావు సూచించారు. గురువారం పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యపై ఆయన దృష్టిసారించి పామూరు రోడ్డులో తన సిబ్బందితో పర్యటించి షాపుల ముందు పార్క్ చేసిన వాహనాలను చలానాల విధిస్తూ వారికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బదులు కలగకుండా రోడ్ల పై ఉండే తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇష్టం వచ్చినట్లుగా రహదారికి అడ్డుగా వాహనాలు, ఆటోలు నిలపడం వల్ల ట్రాపిక్ సమస్య తలెత్తుతోందన్నారు. వాహనాలను పార్కింగ్ స్థలంలోనే నిలుపుదల చేయాలని ఆయన సూచించారు. వన్ వే ట్రాఫిక్ లైన్ నియంత్రించేందుకు బోర్డు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ధ్రువ ప్రతాలను కలిగి ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెల్ ధరించాలని, లేదంటే భారీ జరిమానాతో పాటు బంకుల్లో పెట్రోల్ పోయరని అన్నారు. అనంతరం సరైనా పత్రాలులేని 20 దివ్యచక్ర వాహనాలను సీజ్ చేశామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరు రూరల్ ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు