టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాతృభాష దినోత్సవ వేడుకలు
BSBNEWS -KANDUKUR 29.08.2024
స్థానిక తిక్కవరపు రామిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మాతృభాష దినోత్సవము సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి, జాతీయక్రీడా దినోత్సవం మేజర్ ధ్యాన్చంద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఓరుగంటి వెంకటేశ్వరరావు తెలుగు భాషా దినోత్సవం గిడుగు రామ్మూర్తి జన్మదిన గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం ఆయన తెలుగు భాష యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతూ కడలి అంచులు దాటి కదిలింది నా తెలుగు !ఎద హృదయం నుండి ఎగిసింది నా తెలుగు! అమ్మ భాషయై అమృతాన్ని పంచింది నా తెలుగు. దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. కృష్ణదేవరాయలు ప్రపంచ భాషల యందు తెలుగు ఒక్కటే వెలుగు, ఎందుకనగా ప్రపంచ విజయాలలో తెలుగువాడి స్పర్శ ప్రమేయం లేకుండా విజయం లేదు, ప్రాచీన ప్రపంచ భాషలలో తెలుగు ఒకటి, కృష్ణ గోదావరి నదులలో తీయని తీగలై పారింది నా తెలుగు, ఆంధ్ర కేసరి పొలికేకతో మొలకెత్తింది నా తెలుగు! మగువ మాంచాల వీర తిలకములో విరబూచింది నా తెలుగు. నాగులేరులో ఏరులై పారింది నా తెలుగు! భరతమాత చేతిలో తేజో రూపం ఐ వినువీధుల్లో ఎగిరింది నా తెలుగు! తిక్కన్న కంఠాన నాదమై పలికింది నా తెలుగు. నన్నయ్య నాలుక మీద నడిచింది నా తెలుగు.
ఎర్రన్న మనసున చంద్రబింబమై పండు వెన్నెల కురిపించింది నా తెలుగు .ప్రపంచానికి కట్టుని బొట్టుని నేర్పించింది నా తెలుగు .గరిమెళ్ళ పాటై పాలించింది నా తెలుగు. ప్రపంచంలో సూర్యోదయమై వెలుగునిచ్చింది నా తెలుగు. అని తెలుగు భాషా దినోత్సవం గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం గురించి ధ్యాన్చంద్ జీవిత విషయాలు హాకీ మాంత్రికుడిగా ఎలా ఎదిగాడు అనే విషయాల మీద కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హాకీ మాంత్రికుడిగా పేరు రావడానికి కారణం వరుసగా మూడు ఒలంపిక్స్ నందు భారతదేశము నాకు బంగారు పతకాన్ని అందించిన వ్యక్తిగా దేశంలో హాకీ కి గుర్తింపు తీసుకువచ్చిన వారీగా అందువలన అతని జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవం గా జరుపుకుంటున్నాము అని తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులు కూడా క్రీడలపై ఆసక్తి కనబరిచి ప్రతిపను ప్రదర్శించవలెనని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ధ్యాన్చంద్ గారి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష గురించి విద్యార్థినీ విద్యార్థులచే తెలుగు ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.