కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

BSBNEWS - VALETIVARIPALEM, - AUGUST 28

వలేటివారిపాలెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 50 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. అధునాతన వైద్య పరీక్షల కోసం నిర్మించబోయే నూతన భవనానికి బుధవారం ఉదయం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైసా ఖర్చు లేకుండా ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2014 -19 సంవత్సరాల మధ్య టిడిపి ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వందల కోట్ల రూపాయలను చంద్రబాబు విడుదల చేశారని ఎమ్మెల్యే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో నియోజకవర్గం నుంచే సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. నూతన భవన నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. తొలుత ఇంటూరి నాగేశ్వరరావు, ఆసుపత్రిని పరిశీలించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో పొగాకు బోర్డు వైస్ చైర్మన్ గుత్తా వాసుబాబు, మండల టిడిపి అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, సర్పంచ్ సాదు శ్రీలత, కందుకూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, వేముల గోపాల్ రావు, ఆసుపత్రి వైద్యులు శ్రీనివాసులు, మణిదీపిక, వైద్య సిబ్బంది, టిడిపి నాయకులు వలేటి ఆంజనేయులు, కాకుమాని హర్ష ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)