మాచవరంలో వరి పంట పరిశీలన
BSBNEWS - MACHAVARAM
మండలంలోని మాచవరం గ్రామంలో వరి పంటను మండల వ్యవసాయాధికారి వి రాము శుక్రవారం పరిశీలించారు. ఈ సంధర్భంగా మండల వ్యవసాయాధికారి మాట్లాడుతూ వరి రకం కే ఎన్ ఎం 1638 పంట 40-45 కాల వ్యవధిలో పిలకల దశలో వున్నదని, కావున రైతులు మిశ్రమ ఎరువులు వాడకం తగ్గించి, పొట్ట దశలో సూటి ఎరువులైన యూరియా 50 కిలోలు, పొటాష్ ఎరువులను 30కెజీ ఒక ఎకరానికి వాడాలని, బ్యాక్టీరియల్ బ్లైట్(బ్యాక్టీరియా ఎండు తెగులు) ఆశించింది అని కాపర్ ఆక్సీక్లోరైడ్ 60 గ్రాములు, స్ట్రెప్టో సైక్లిన్ 2 గ్రాములు 20లీటర్ నీటిలో కలుపుకోనీ పిచికారి చేసి నివారించవచ్చని తెలియజేసారు. 10 రోజుల తర్వాత కార్బండజీమ్ మందును ఎకరాకు 200 గ్రాములు పిచ్చికరి చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఈ పంట ద్వారా వేసిన పంటలను నమోదు చేసుకొనుటకు సాగుదారులు, కౌలు రైతులకు అవకాశం ఉందని, రైతులందరూ తప్పనిసరిగా గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా పంట నమోదు చేసుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయినపుడు, పంట నష్టరిహారాన్ని, భీమా కూడా పొందవచ్చు, అని అన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలియజేసారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు సి. హెచ్. రోనీ రేచల్, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.