వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

0

 వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన

BSBNEWS - VIJAYAWADA 

7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలను ఆదుకుంటామని భరోసానిచ్చారు.  విజయవాడలోని భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారు. నీటి ప్రవాహాలు చూసారు. సింగ్ నగర్ లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. భారీ వర్షం, వరద నీటిలోనూ 3 గంటల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి వరద బాధితులతో స్వయంగా మాట్లాడారు. ఆహారం, నీరు సరఫరాపై ఆరా తీశారు.  అనంతరం సింగ్ నగర్ నుండి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్ పేట, ఓల్డ్ ఆర్ఆర్ పేట, పైపుల రోడ్డుకు చేరుకున్నారు. ఆయా ప్రాంతాల బాధిత ప్రజలు సీఎంతో తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. ఆహారం, నీరు దొరుకుతున్నా వరద ముంపుతో తాము తీవ్రంగా నష్టపోయాని సీఎం వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న వస్తువులు, వాహనాలు వరద కు దెబ్బ తిన్నాయని, తమను ఆదుకోవాలని మహిళలు సీఎం ను కోరారు. గండ్లు పూడ్చివేత పూర్తైనందున రేపు లేదా ఎల్లుండి ఉదయానికి వరద సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. అక్కడి నుండి తిరిగి కాన్యాయ్ లో కలెక్టరేట్ కు చేరుకున్నారు. మూడు గంటల పాటు పర్యటించి ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పరిశీలన జరిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)