వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎమ్మెల్యే

0

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎమ్మెల్యే

BSBNEWS - KANDUKUR 

కందుకూరు నియోజకవర్గం ప్రజలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వినాయచవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన మొదటి పూజలన్నీ గణనాథుడికే అని, విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి ఆశీస్సులతో, మీరు చేపట్టే ప్రతి పని సంపూర్ణంగా విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఏకదంతుడి కృపతో మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలి అని, క్షేమ స్థైర్య ఆయురారోగ్యాలను బొజ్జగణపయ్య మీకు చేకూర్చాలి అన్నారు. బంధుమిత్రులతో కలసి ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరారు.

Post a Comment

0Comments
Post a Comment (0)