బుడమేరు గండ్లు పూడ్చే ప్రతిష్ఠాత్మక పనులను చేపట్టిన వల్లభనేని కన్ స్ట్రక్షన్స్

0

 బుడమేరు గండ్లు పూడ్చే ప్రతిష్ఠాత్మక  పనులను చేపట్టిన వల్లభనేని కన్ స్ట్రక్షన్స్ 

BSBNEWS - 10/9/2024

విజయవాడను వరదలతో విలయం సృష్టించి జనజీవనాన్ని అతలాకుతలం చేసిన బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చే పనులను వల్లభనేని కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి రాష్ర్ట ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కంపెనీని బుడమేరు గండ్లను పూడ్చడానికి ఎంపిక చేయడం కాంట్రాక్టర్ వర్గాల్లో విశేషంగా మారింది. తాను ఏ పనిని చేపట్టినా దానిని శ్రద్ధతో, నాణ్యతతో నిర్మాణం పూర్తి చేస్తారనే పేరు ప్రఖ్యాతులు వల్లభనేని కన్ స్ట్రక్షన్స్ అధినేత వల్లభనేని వెంకటేశ్వరరావుకు ఉన్నాయి. పనులు పూర్తి చేయడంలో మంచి ప్రొఫైల్, మంచి నిర్మాణ నేపథ్యం గల ఈ సంస్థ పేరును బుడమేరు గండ్లు పూడ్చడానికి ఇంజినీరింగ్ అధికారులు ముఖ్యమంత్రికి సిఫార్సు చేశారని సమాచారం.  ఇంజినీరింగ్ నిపుణుల సిఫార్సును వెంటనే అంగీకరించిన ముఖ్యమంత్రి స్వయంగా వల్లభనేని వెంకటేశ్వరావును పిలిపించుకుని బుడమేరు గండ్లను పూడ్చాలని కోరడంతో ఆయన వెంటనే తన మందీ మార్బలం, యంత్రాలతో పనిలోకి దిగారు. ప్రస్తుతం బడమేరు గండ్లు పూడ్చే పనులు జోరుగా సాగుతున్నాయి. 

ఉభయ తెలుగు రాష్ర్టాల్లో కేవలం లాభాపేక్షతోనే కాకుండా ప్రజలకు మేలు జరిగేలా, యావత్ ప్రజానీకం మెచ్చుకునేలా వల్లభనేని కంపెనీ పలు నిర్మాణాలను చేసింది. 

ఇదే కంపెనీ కొంత కాలంగా సింగరాయకొండ- మాలకొండ జాతీయ రహదారి పనులను చేపట్టిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments
Post a Comment (0)