పసి బిడ్డను తల్లి దండ్రుల చెంతకు చేర్చిన బాలల సంరక్షణ అధికారులు.
BSBNEWS - NELLORE
తల్లిదండ్రుల వద్దకు పసిబిడ్డ ను సోమవారం బాలల సంరక్షణ అధికారులు చేర్చిన సంఘటన నెల్లూరులో జరిగినది. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం
నెల్లూరు ఆర్ టి సి మెయిన్ బస్టాండు లొ మూడు నెలల పసిబాబుని బస్టాండు ఆవరణలో ఓ కసాయి తల్లి వదిలి వెళ్లడంతో దానిని చూసిన స్థానికులు ఆర్టీసీ పోలీస్ వద్ద ఉంచి సాయంత్రం వరకు ఎవరు రాక పోవడంతో జిల్లా బాలల సంరక్షణ అధికారికి బి. సురేష్ కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అధికారి తన సిబ్బంది తో ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్లి ఆర్టీసీ యాజమాన్యం, పోలీస్ వారితో మాట్లాడి బిడ్డను తీసుకొని నెల్లూరులోని శిశు సంక్షేమ సాధికార గృహకు తీసుకొని వెళ్ళి వారికి అప్పగించారు. ఈ సందర్భంగా శ్రీ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ సాధికార అధికారిని బి హేన సుజన్ మాట్లాడుతూ బిడ్డ దొరికిన చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో పాపకు సంబందించి సెక్షన్ 317కింద ఎఫ్ ఐ ఆర్ నమోది చేపించడం జరిగిందన్నారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన దగ్గర నుండి జిల్లా బాలల సంరక్షణ అధికారి సిబ్బందిని టీమ్స్ గా వేసి ఈ బిడ్డ తల్లిదండ్రులు కోసం వెతికే ప్రయత్నం చేశారన్నారు. నెల్లూరు నగరం అంత గాలించగా ఎట్టకేలకు తల్లి దండ్రులు ఆచూకీ తెలియడంతో బిడ్డను తల్లిదండ్రులుకు అప్పగించడం జరిగిందన్నారు.

