ఈనెల 22 న జరిగే అఖిల భారత మహిళా సమాఖ్య జనరల్ బాడి సమావేశంను విజయవంతం చేయండి
BSBNEWS - కందుకూరు
నెల 22వ తేదీ ఆదివారం పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద జరిగే అఖిలభారత మహిళా సమాఖ్య జనరల్ బాడీ సమావేశంను విజయవంతం చేయాలని అఖిల భారత మహిళా సమాఖ్య సభ్యులు కోరారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా దేశంలో ఏదో ఒక మూల మహిళ బలవుతూనే ఉందని వారు అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వాటిని సక్రమంగా అమలు చేయకపోవటమే అందుకు కారణాలని వారు ఆరోపించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే ఆ మహిళలకు న్యాయం జరిగేంత వరకు అఖిల భారత మహిళా సమాఖ్య తరుపున పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశానికి అఖిలభారత మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు వి.జయలక్ష్మి పాల్గొని మహిళలపై జరుగుతున్న దాడులను ఎలా అరికట్టాలలో, మహిళలకు ఉన్న చట్టాల గురించి మహిళలకు 22 న జరిగే జనరల్ బాడీ సమావేశంలో అవగాహన కల్పిస్తూ వివరించటం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలో నలుమూలల నుండి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మహిళా సమాఖ్య సభ్యులు మెండా శైలజ, ఓలేటి కల్పన, కారంశెట్టి ఇందిరా, మిడసల పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

